Prabhash-Charan: ప్రభాస్, చరణ్ నిర్మాణ సంస్థలు ఇక లేనట్టేనా?
గత రెండు మూడు రోజులుగా ప్రభాస్, రామ్ చరణ్ గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా తమ తమ బడా సంస్థలను పక్కకు పెట్టేశారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ప్రభాస్, చరణ్ తమ సొంత బ్యానర్లను నిజంగానే పక్కకు పెట్టేశారా?
టాలీవుడ్(Tollywood) నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో ఈ బ్యానర్ స్టార్ట్ అయింది. ప్రభాస్ తన స్నేహితులైన వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు కలిసి 2013లో యూవీ క్రియేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రభాస్‌కు హోం బ్యానర్ లాంటిది. చివరగా ఈ నిర్మాణ సంస్థ సాహో, రాధే శ్యామ్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్ కొత్త ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్(Prabhash) కూడా ఈ బ్యానర్‌ను దూరం చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. యూవీ క్రియేషన్స్‌కు వెళ్లాల్సిన ఆదిపురుష్ తెలుగు రైట్స్ పీపుల్స్ మీడియాకు వెళ్లడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. టీ సిరీస్ బ్యానర్‌తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామిగా రానున్న స్పిరిట్ ప్రాజెక్ట్‌లో.. ఇప్పుడు యూవీ ప్లేస్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎలాగు మారుతి సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
దాంతో యూవీ నుంచి ప్రభాస్(Prabhash) దాదాపుగా అవుట్ అయినట్టే కనిపిస్తోంది. ఇదే సమయంలో విక్రమ్ రెడ్డితో కలిసి ‘వి మెగా పిక్చర్స్’ పేరుతో మరో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు రామ్ చరణ్. నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌజ్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇప్పటికే చరణ్(Charan)కు కొణిదెల ప్రొడక్షన్ హౌజ్ ఉంది. అయినా ఇప్పుడు మరో కొత్త బ్యానర్ స్టార్ట్ చేశాడు. దీంతో కొణిదెల ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ ఆగిపోయినట్టేనా? అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చరణ్, ప్రభాస్ ఏం చేస్తారో చూడాలి.