»Pawan With Kannada Director Remake Title For Ugadi
Pawan Kalyan : కన్నడ డైరెక్టర్‌తో పవన్.. ఉగాదికి రీమేక్ టైటిల్!?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సర్ప్రైజ్ రావడం కొత్తేం కాదు. క్రిష్ 'హరిహర వీరమల్లు'ని పక్కకు పెట్టి.. ఆ మధ్య సాహో డైరెక్టర్ సుజీత్‌తో సినిమా ప్రకటించి.. షాక్ ఇచ్చాడు. వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేశారు. అలాగే హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్‌ను పక్కకు పెట్టేసి.. ఉస్తాద్ భగత్ సింగ్‌గా సర్ప్రైజ్ చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సర్ప్రైజ్ రావడం కొత్తేం కాదు. క్రిష్ ‘హరిహర వీరమల్లు’ని పక్కకు పెట్టి.. ఆ మధ్య సాహో డైరెక్టర్ సుజీత్‌తో సినిమా ప్రకటించి.. షాక్ ఇచ్చాడు. వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేశారు. అలాగే హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్‌ను పక్కకు పెట్టేసి.. ఉస్తాద్ భగత్ సింగ్‌గా సర్ప్రైజ్ చేశాడు. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్ చేసి.. వెంటనే సముద్రఖనితో వినోదయ సీతమ్ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇలా పవన్ నుంచి ఎప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ వస్తుందో చెప్పడం కష్టం. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్‌కు పవన్ పచ్చ జెండా ఊపాడనే టాక్ ఊపందుకుంది. కన్నడ నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కబ్జ’. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ సినిమాకు ఆర్. చంద్రు దర్శకత్వం వహించాడు. పవన్‌తో చంద్రుకి మంచి బాండింగ్ ఉంది. ఇప్పటికే పవన్‌కి స్టోరీ లైన్ వినిపించగా.. ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే కబ్జ ప్రమోషన్లో భాగంగానే.. ఈ కాంబినేషన్ సెట్ అయిందనే ప్రచారం జరుగుతుందని చెప్పొచ్చు. అయినా కూడా.. పవన్ ఈ ప్రాజెక్ట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ నుంచి బిగ్ సర్ప్రైజ్ రావడం మాత్రం పక్కా అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘వినోదయ సీతం’ రీమేక్ టైటిల్‌ను.. ఉగాది కానుకగా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఉగాది రోజు ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో చూడాలి.