Pawan Kalyan షాకింగ్ నిర్ణయం.. జనసేనలో టికెట్ల కోసం డబ్బు!
ఎన్నికల్లో పోటీ చేయడానికి భారీ ఖర్చులు అవసరం. పార్టీలకు నిధుల సమీకరణ ఒక సవాలుగా ఉంటుంది. విరాళాలు, పార్టీ ఫండ్ ద్వారా నిధులు సేకరిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నారు.
Pawan Kalyan: ఎన్నికల్లో పోటీ చేయడానికి భారీ ఖర్చులు అవసరం. పార్టీలకు నిధుల సమీకరణ ఒక సవాలుగా ఉంటుంది. విరాళాలు, పార్టీ ఫండ్ ద్వారా నిధులు సేకరిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నారు. టికెట్ల కోసం డబ్బు ఇచ్చే వారిని పవన్ కళ్యాణ్ తిరస్కరిస్తున్నారు. తాను టికెట్ల కోసం డబ్బు తీసుకోనని స్పష్టం చేశారు. ఇటీవల కొంతమంది టికెట్ల కోసం చెక్కులు ఇచ్చారు. పవన్ వారికి చెక్కులు తిరిగి ఇచ్చి, తనకు డబ్బు అవసరం లేదని చెప్పడం విశేషం.
పార్టీలో అవినీతిని నివారించడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.టికెట్లను డబ్బుతో కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వకూడదని ఆయన భావన.అర్హత, సేవ, నిబద్ధత ఆధారంగా టికెట్లు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు.కాగా..ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.పవన్ కళ్యాణ్, నిజాయితీ, నిబద్ధతకు ప్రశంసలు వస్తున్నాయి. టికెట్ల కోసం డబ్బు ఇచ్చే సంస్కృతికి ఇది చెక్ పెడుతుందని ఆశిస్తున్నారు. గతంలో తాము పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చినట్లుగా పేర్కొంటూ.. అందుకు బదులుగా తమకు టికెట్లను కన్ఫర్మ్ చేయాలని కోరుతున్న ఆశావాహులకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు.
మీ విరాళాలు నాకొద్దు.. టికెట్ కోసం విరాళాలు ఇచ్చి ఉంటే.. మీరు ఇచ్చిన విరాళాల్ని తీసుకెళ్లిపోవాలంటూ పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. పార్టీకి సంబంధించి ఎవరైనా చెక్కులు ఇవ్వటం.. విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చేసి.. ఆ తర్వాత టికెట్ అడితే వారిని అస్సలు ప్రోత్సహించొద్దంటూ స్పష్టమైన ఆదేశాల్ని పార్టీ నేతలకు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మాటల్లోనే కాదు.. ఇప్పటికే కొన్ని చెక్కుల్ని తిరిగి పంపించినట్లుగా చెబుతున్నారు. ఈ వైఖరి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇలాంటి పార్టీ అధినేత తెలుగు రాజకీయాల్లో చూడలేదన్న మాట వినిపిస్తోంది.