రాజకీయాల కారణంగా.. అనుకున్న సమయంలో సినిమాలు పూర్తి చేయలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు వీలైనంత త్వరగా.. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్గా ‘హరిహర వీరమల్లు’ వర్క్ షాప్ నిర్వహించిన సంగతి తెలిసిందే..
అతి త్వరలోనే ఈ సినిమా తిరిగి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అలాగే తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతం’ను కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక హరీష్ శంకర్ ఎప్పటి నుంచో పవన్ కోసం ఎదురు చూస్తున్నాడు. పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం.. ‘భవదీయుడు భగత్ సింగ్’ను జెట్ స్పీడ్తో ముగించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుదిరితే ఎలక్షన్ లోపు.. లేదంటే ఎన్నికల తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నారట. గతంలోనే ఇలాంటి వార్తలొచ్చినా ఇప్పుడది నిజమేనని అంటున్నారు.
ఒకవేళ ఇదే నిజమైతే.. పవన్ తొలిసారి వయసు మళ్లిన తండ్రి పాత్రలో కనిపించడమే కాదు.. ఫస్ట్ టైం డ్యూయెల్ రోల్ చేయనున్నారని చెప్పొచ్చు. దీంతో గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.