విలన్ పాత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ తన సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫతేహ్ జనవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూ అరుంధతి సినిమాలోని పశుపతి క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లోనే బాగా కష్టపడ్డ పాత్ర అని అన్నాడు. మేకప్‌కే ఆరేడు గంటలు పట్టేదన్నాడు. మేకప్ ద్వారా దద్దుర్లు వచ్చాయని వెల్లడించాడు.
జీ తెలుగు: సుబ్రహ్మణ్యపురం (9AM), 30రోజుల్లో ప్రేమించడం ఎలా (11PM); ఈటీవీ:దేవి పుత్రుడు (9AM); జెమినీ: పెదరాయుడు (8.30AM), గబ్బర్ సింగ్ (3PM); స్టార్ మా మూవీస్: బెదురులంక2012 (7AM), టక్ జగదీష్ (9AM), బ్రహ్మాస్త్రం (12PM),సర్కారు వారి పాట (3PM), మంజుమెల్ బాయ్స్ (6PM), స్కంద (8.30PM); జీ సినిమాలు: మిస్ శెట్టి Mr పోలిశెట్టి (7AM), శతమానం భవతి (9AM), హనుమాన్ (12PM), శివలింగ (3PM), విక్రమ్ రాథోడ్ (6...
‘పుష్ప-2’ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ వస్తోన్న విషయం తెలిసిందే. అలాంటి వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ తాజాగా స్పందించింది. సినిమా ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. థియేటర్లో విడుదలైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని.. ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని స్పష్టం చేసింది.
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇవాళ OTTలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో విడుదలైన ‘పుష్ప 2’ మూవీ ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. హిందీ బాక్సాఫీసు వద్ద రూ.632 కోట్లు (నెట్) దక్కించుకొని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన 15 రోజుల్లోనే అంత మొత్తాన్ని కలెక్ట్ చేసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ టీమ్ నుంచి అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ ఫొటోతో ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈనెల 29న విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
మెగాస్టార్ చిరంజీవిపై యాక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1982లో చిరు, మోహన్‌బాబు కలిసి నటించిన చిత్రం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ గురించి పలు విషయాలను పంచుకున్నారు. ‘నా స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయనకు సోదరుడిగా నటించడం వల్ల ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది’ అని పోస్ట్ ...
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘NKR21’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ నటిస్తున్నారు. ఇవాళ సోహైల్ బర్త్ డే సందర్భంగా.. మేకర్స్ ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తుండగా.. సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది.
తన తల్లిదండ్రులు మోనా కపూర్, బోనీకపూర్ విదాకులపై నటుడు అర్జున్ కపూర్ తాజాగా స్పందించాడు. తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్లిద్దరూ విడిపోయారని.. అది తననెంతో బాధించిందని అన్నాడు. నాన్న చేసిన పనికి ఆయన హ్యాపీగా ఉన్నంతకాలం తాను ఏవిధంగాను ఇబ్బందిపడనని చెప్పాడు. కాగా, మోనా కపూర్‌తో విడాకుల అనంతరం బోనీకపూర్ నటి శ్రీదేవిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ఇండియన్ 2’ మూవీ పరాజయం పొందింది. దీంతో ‘ఇండియన్ 3’ థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో రిలీజ్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ దర్శకుడు శంకర్.. ‘ఇండియన్ 3’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ తప్పకుండా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని, త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘OG’. తాజాగా ఈ సినిమాను ఉద్దేశించి నటి శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. ‘సలార్’లో తాను పోషించిన పాత్రకు.. ఈ మూవీలోని రోల్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇందులో తన పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని చెప్పారు.
తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా ‘అమరన్’ సినిమాకు గాను ఉత్తమ నటిగా సాయి పల్లవి, ‘మహారాజ’ మూవీకి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డులు అందుకున్నారు. తమకి అవార్డు రావడంపై విజయ్, సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేశారు. తమను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో రాబోతున్న మూవీ ‘OG’. ఈ సినిమా షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్ వచ్చింది. తాజాగా బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ షెడ్యూల్లో పలు కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. ఇక DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ తదితరులు కీలక పాత్ర...
కథల ఎంపిక గురించి మలయాళ స్టార్ మోహన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసుకు చేరువైన కథలను మాత్రమే ఎంచుకుంటున్నట్లు చెప్పారు. ‘మలైకోటై వాలిబన్’ పరాజయం తర్వాత కథల ఎంపికలో తాను మరింత ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ప్రేక్షకులు మాత్రం దాన్ని ఆదరించలేదని అన్నారు. అది ఫ్లాప్ అయినప్పుడు తనకంటే ఫ్యాన్స్, శ్రేయోభిలాషులే ఎక్కువగా బాధపడ్డారని పేర్కొన...