ఎన్నికల కారణంగా కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ మరికొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్ లేదా ఓటీటీలో విడుదల అవుతున్న చిత్రాలేవో తెలుసుకుందాం.
తెలుగు అగ్ర దర్శకుడిగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న రాజమౌళిని అంతా సరదాగా జక్కన్న అని పిలుస్తుంటారు. అయితే అంతకు మించిన ముద్దు పేరు ఆయనకు మరోటి ఉందట. అదేంటంటే..?
ఫైనల్‌గా కల్కి కొత్త రిలీజ్ డేట్ బయటకి రావడంతో.. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి నుంచి రోజులెక్కన లెక్కపెడుతున్నారు. మేకర్స్ కూడా బిజినెస్ డీల్ క్లోజ్ చేస్తున్నారు. తాజాగా నైజాం ఏరియా రైట్స్ వివరాలు బయటికొచ్చాయి.
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు స్టార్ హీరో విశాల్. అయితే.. రాను రాను విశాల్ మార్కెట్ కాస్త గట్టిగానే తగ్గిపోయింది. లేటెస్ట్‌గా వచ్చిన రత్నం సినిమా కూడా కాపాడలేకపోయింది.
హాట్ బ్యూటీ శృతి హాసన్ లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. ఏ విషయాన్నైనా సరే బాహాటంగానే చెప్పేస్తుంది అమ్మడు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఓ స్టార్ దర్శకుడి వల్ల తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసినట్టుగా టాక్ నడుస్తోంది.
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. గత కొన్నాళ్లుగా హెల్త్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. తాజాగా కొత్త సినిమాను ప్రకటించింది. ఈ సినిమాకు నిర్మాత కూడా తనే కావడం విశేషం.
సమంత నటిస్తున్న తాజా చిత్రం పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. చేతులో గన్ పట్టుకున్న గృహిణిలా కనిపిస్తుంది. ఈ రోజు సమంత పుట్టిన రోజు కావడంతో తాజా పోస్టర్ వైరల్ అవుతుంది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతనిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేశారు.
విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో విశ్వన్ సేన్ ఊచకోత కోశాడు. దీంతో విశ్వక్ కెరీర్లోనే ఊరమాస్ సినిమాగా ఇది నిలిచేలా ఉంది.
డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి కొత్త రిలీజ్ డేట్ ఫైనల్‌గా బయటికి వచ్చేసింది. ఎన్నికల నేపథ్యంలో మే 9 నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్న తేదినే విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. పోర్న్ వీడియోస్ చూస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది విద్యాబాలన్. ఇదిలా ఉండగానే.. విద్యా బాలన్ విడాకులు అనే న్యూస్ వైరల్‌గా మారింది.
అప్పుడప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ చేసే కామెంట్స్ సంచలనంగా ఉంటాయి. ఫలానా వారు తనని వేధించారని, కమిట్మెంట్ అడిగారంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెబుతునే ఉంటారు. లేటెస్ట్‌గా ఓ సీరియల్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది.
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద కాస్త ఎక్కువగా ఉంటోంది. ఎంత జాగ్రత్తగా ఉన్న సరే.. లీకుల్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. తాజాగా సీతారాముడిగా నటిస్తున్న సాయి పల్లవి, రణ్‌బీర్ ఫోటోలు లీక్ అయ్యాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి.. సినిమాల పరంగా ఇప్పట్లో కొత్త అప్డేట్స్ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. పవన్ రీ ఎంట్రీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.