»Keeravani Son Revealed Rajamoulis Another Nickname
Rajamouli : రాజమౌళికి జక్కన్నే కాదు.. మరో ముద్దు పేరూ ఉంది!
తెలుగు అగ్ర దర్శకుడిగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న రాజమౌళిని అంతా సరదాగా జక్కన్న అని పిలుస్తుంటారు. అయితే అంతకు మించిన ముద్దు పేరు ఆయనకు మరోటి ఉందట. అదేంటంటే..?
Rajamouli Nick name : బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. సినిమాలను శిల్పం చెక్కినట్లు చెక్కుతాడనో ఏమో జక్కన్న అనే ముద్దు పేరు ఆయనకు వచ్చేసింది. దీనితో పాటు మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ముద్దు పేర్లూ ఆయనకు ఉన్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యుల్లో మాత్రం కొంత మంది ఆయనను బాబా(BABA) అని పిలుస్తారట.
రాజమౌళి(RAJAMOULI) తమకు వరుసకు బాబాయ్ అవుతారని కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా తెలిపారు. అందుకనే తాము బాబాయ్‌ని షార్ట్‌కట్‌లో బాబా(BABA) అని పిలుస్తామని వెల్లడించారు. అలా పిలిపించుకోవడం రాజమౌళికి కూడా చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. తనను అలానే పిలవమంటూ ఆయన చెబుతారని చెప్పారు. దీంతో అంత పెద్ద దర్శకుడైన రాజమౌళికి కుటుంబం అన్నా, కుటుంబ సభ్యులన్నా ఎంత ప్రేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
షూటింగ్ ఉన్న సమయంలో చాలా డెడికేటెడ్‌గా ఉండే రాజమౌళి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ఈ మధ్య కాలంలో తన భార్య రమా రాజమౌళితో కలిసి ఓ కుటుంబ వెడ్డింగ్ ఫంక్షన్లో స్టెప్పులేసిన వీడియో ఎంత పెద్ద వైరల్ అయ్యిందో అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.