ఎన్నికల కారణంగా కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ మరికొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్ లేదా ఓటీటీలో విడుదల అవుతున్న చిత్రాలేవో తెలుసుకుందాం.
ఆ ఒక్కటీ అడక్కు
పెళ్లి వయస్సు వచ్చిదంటే చాలు.. అందరు పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంటారు. వయస్సు పెరిగిపోతుంటాది కానీ పెళ్లి ప్రయత్నాలు మాత్రం సక్సెస్ కావు. పెళ్లెప్పుడు అని వెంటపడే వాళ్లకి కొత్త సెక్షన్ పెట్టి శిక్ష వేయాలని న్యాయస్థానాన్ని కోరుకుంటాడు. పెళ్లి విషయంలో నిజజీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో.. అవన్నీ కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో వచ్చేస్తున్నారు. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో ఏళ్ల తర్వాత అల్లరి నరేశ్ కామెడీ సినిమాతో రానున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.
ప్రసన్నవదనం
డిఫరెంట్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుహాస్.. ఈసారి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో అలరించనున్నాడు. అర్జున్ వై.కె దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుహాస్ హిట్ కొడతాడో లేదో చూద్దాం.
శబరి
అనిల్ కాట్జ్ దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న చిత్రం శబరి. తల్లీ కూతురు సెంటిమెంట్‌తో రానున్న ఈ చిత్రం కూడా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రానుంది.
బాక్
ఖుష్బు సుందర్, ఏపీఎస్ అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, కోవై సరళ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జితేందర్ రెడ్డి
ఉయ్యాల జంపాలతో హిట్ కొట్టిన విరించి వర్మ డైరెక్ట్ చేసిన మూవీ జితేందర్ రెడ్డి. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.