ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్ బాబుతో SSMB 28 మూవీ చేస్తున్నాడు. ఇలా ఇద్దరు బిజి బిజీగానే ఉన్నారు. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. కానీ ఓ బడా నిర్మాత మాత్రం ఈ ఇద్దరితో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడట. అది కూడా తారక్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందని తెలిసి కూడా ఆ వైపుగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్‌నే స్వయంగా త్రివిక్రమ్ దగ్గరికి సదరు నిర్మాతను పంపినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ‘అరవింద సమేత’ తర్వాత మరోసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి పని చేయాలనుకున్నారు. ఆ ప్రాజెక్ట్‌ను అధికారికంగా కూడా ప్రకటన చేశారు. ఇక అంతా సెట్ అనుకున్న సమయంలో.. ఏమైందో ఏమోగానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగానే ఆ సినిమా ఆగిందని ఇండస్ట్రీ టాక్. దాంతో ఎన్టీఆర్, కొరటాల శివతో కమిట్ అవగా.. త్రివిక్రమ్, మహేష్‌తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అలాంటిది తాజాగా మళ్లీ ‘ఎన్టీఆర్-త్రివిక్రమ్’ కలవబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఓ ప్రముఖ నిర్మాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలో రీసెంట్గా తారక్‌ను కలవగా.. త్రివిక్రమ్‌తో అయితే చేద్దామని చెప్పాడట. త్రివిక్రమ్ కూడా అందుకు ఓకే చెప్పాడట. దాంతో.. మళ్లీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడుటుందో చూడాలి.