NTR Fans : చిరు, పవన్ పై మండి పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
NTR Fans : దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇద్దరు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇద్దరు ఆఫ్ స్క్రీన్‌లో మంచి ఫ్రెండ్స్ కావడంతో.. ఆన్ స్క్రీన్‌లో దుమ్ముదులిపేశారు.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇద్దరు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇద్దరు ఆఫ్ స్క్రీన్‌లో మంచి ఫ్రెండ్స్ కావడంతో.. ఆన్ స్క్రీన్‌లో దుమ్ముదులిపేశారు. దాంతో ఇంటర్నేషనల్ వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యారు. ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో.. చరిత్రకు అడుగు దూరంలో ఉన్నారు. మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికాకు వెళ్లిపోయాడు రామ్ చరణ్. అక్కడ ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నాడు. అయితే ఆస్కార్ కంటే ముందే.. పలు ప్రముఖ అవార్డ్స్ సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఏకంగా 5 అవార్డులు దక్కించుకుంది. ఇక రామ్ చరణ్ ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా చరణ్‌ను అభినందించారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. పవర్ స్టార్ సైతం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించక పోవడం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన పార్టీ తరఫున విడుదల చేసిన ప్రెస్ నోట్లో.. చరణ్, రాజమౌళితో పాటు చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు పవన్. కానీ ఈ ప్రెస్ నోట్లో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదు. దాంతో పవన్ పై సినీ వర్గాలతో పాటు.. రాజకీయంగాను విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ పేరును ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో మెగా బ్రదర్స్ తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు. కావాలనే ఎన్టీఆర్‌ను అలా చేశారని అంటున్నారు. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. రామ్ చరణ్ మాత్రమే అక్కడికి వెళ్లాడు కాబట్టి.. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదని అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఏదో ఓ రకంగా గొడవ పడుతునే ఉన్నారని చెప్పొచ్చు.