నందమూరి బ్రదర్స్ మరోసారి వేదిక పంచుకుంటే చూడాలని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు ఒకే స్టేజీ పైకి రావాల్సి ఉండగా.. ఇప్పుడు కుదరదని తెలుస్తోంది. మరి డెవిల్ పరిస్థితేంటి?
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సలార్ కలెక్షన్ల మోత మోగిస్తోంది. సలార్ దెబ్బకు మరో సినిమా థియేటర్లోకి రావడానికి సాహసం చేయడం లేదు. సంక్రాంతి వరకు సలార్‌దే హవా ఉండనుంది. అయినా కూడా డైనోసర్‌ను ఢీ కొట్టడానికి డెవిల్ వస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ డెవిల్ మూవీ సలార్ రిలీజ్ అయిన వారానికి, డిసెంబర్ 29న థియేటర్లోకి రాబోతోంది. డెవిల్ ఎఫెక్ట్ సలార్ పై ఉంటుందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈసారి మాత్రం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా డెవిల్ ఈవెంట్‌కు దూరంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
రిలీజ్ టైం దగ్గర పడడంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు డెవిల్ మేకర్స్. ఈ నేపథ్యంలో డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహిస్తారని అనుకున్నారు. ఆ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీర్ ముఖ్య అతిథిగా వస్తాడని భావించారు. టైగర్ వస్తే దేవర అప్డేట్ కూడా ఉంటుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే డెవిల్ థియేటర్లోకి రానుందని అంటున్నారు. ఒకవేళ డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే.. ఎన్టీఆర్ రావాల్సిందే. ఎందుకంటే.. కళ్యాణ్ రామ్ ప్రతి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు తారక్.
అయితే ఈసారి మాత్రం ఎన్టీఆర్ ఈవెంట్‌కి అందుబాటులో ఉండే ఛాన్స్ లేదంటున్నారు. దేవరకు స్మాల్ బ్రేక్ ఇచ్చి.. క్రిస్మస్, సంక్రాంతి హాలిడేస్ ఉండడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు. డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోవడానికి ఇదో కారణమని చెప్తున్నారు. కానీ అసలు డెవిల్ ఉంటుందా? లేదా? అనే విషయంలోనే క్లారిటీ లేదు. మరి డెవిల్ ఏం చేస్తాడో చూడాలి.