Niharika: మెగా ప్రిన్సెస్ నిహారిక (Niharika) విడాకులు తీసుకుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంత మంది ఎన్ని కామెంట్స్ చేసినా ఎవరూ స్పందించకపోగా, తాజాగా నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ విడాకులపై అధికారికంగా ప్రకటించారు. గతం వారంలో చైతన్య, నిహారికకు (Niharika) కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ డివోర్స్ గురించి అధికారికంగా ప్రకటించారు.
నిహారిక (Niharika) విడాకులు తీసుకున్న తర్వాత మంగళసూత్రం ఏం చేసింది అన్న దానిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయి. విడాకుల తర్వాత నిహారిక వెంటనే తన మంగళ సూత్రాన్ని చైతన్యకు పంపించేసింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం తన మంగళ సూత్రం తన దగ్గరే ఉంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది.
2020 డిసెంబర్లో నిహారిక, టెక్ అఫిషీయల్ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. ఉదయ్‌పుర్ వేదికగా వెడ్డింగ్ వైభవంగా జరిగింది. పెళ్లైన కొంత కాలానికే వీరు విడాకుల బాట పట్టడం గమనార్హం. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ముఖ్యంగా ఫోటోలను డిలీట్ చేయడంతో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలు వచ్చాయి. ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అధికారికంగా ఇటీవల ప్రకటించారు. వీరిద్దరూ మ్యూచువల్గా ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. నిన్ననే వారిద్దరికీ విడాకులు వచ్చాయి. వీరిద్దరూ ఒకేసారి తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.
విడాకులకు కారణం ఏంటి అని చాలా మంది ఆరాతీయడం మొదలుపెట్టారు. వారి మధ్య మనస్పర్థతలు రావడమే కారణం అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత నిహారిక (Niharika) చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఓసారి పబ్ పార్టీ డ్రగ్స్ విషయంలో ఆమె పేరు బాగా చర్చనీయాశంమైంది. ఆ తర్వాత ఓ సారి వారు ఉంటున్న అపార్ట్మెంట్ వాళ్లతో గొడవ జరిగిందని మరో వివాదం బయటకు వచ్చి స్టేషన్ వరకు వెళ్లింది. ఇవి కూడా విడాకులకు దారితీశాయని తెలుస్తోంది.