Shirish Bharadwaj: మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతిచెందారు. బుధవారం ఉదయం ఓ ప్రైవేటు హాస్పటల్లో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో హాస్పటల్లో అడ్మిట్ అయ్యారు. శిరీష్‌కు ఊపితిత్తుల సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో వైద్యానికి రెస్పాండ్ అవలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చనిపోయినట్లు తెలుస్తుంది. శిరీష్ భరద్వాజ్ మృతి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, శిరీష్ భరద్వాజ్ 2007లో లవ్ మ్యారెజ్ చేసుకున్నారు. ఆ విషయంలో అప్పట్లో హాట్ టాపిక్. ఆ తరువాత కొన్నాళ్లకు మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోయారు. వారికి ఒక పాప కూడా ఉంది. ఆ తరువాత శిరీష్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక శ్రీజ కూడా కల్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప ఉంది. కొన్నాల్లకు శ్రీజ రెండో వివాహం నుంచి కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరు కూతుల్లతో తండ్రి చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది.