»Nidhhi Agerwal Perform Raja Shyamala Pooja With Venu Swamy
Niddhi Agerwal: ఆ స్వామితో కలిసి హీరోయిన్ నిధి అగర్వాల్ పూజలు..వీడియో వైరల్
టాలీవుడ్(Tollywood) సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పి వేణు స్వామి(Venu swamy) పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్(Viral) అవుతూ ఉంటాయి. తాజాగా వేణు స్వామి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Niddhi Agerwal) ఇంట్లో ఆయన యాగం చేశారు. నిధి అగర్వాల్ తో ఆయన పూజలు చేయించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.

సినీ కెరీర్ సజావుగా సాగేందుకు చాలా మంది సెలబ్రిటీలు(Cine Celebrities) పూజలు చేస్తూ ఉంటారు. మంచి అవకాశాలు రావాలని, తమకున్న బ్యాడ్ టైమ్ వెళ్లిపోవాలని, ఆటంకాలు కలగకూడదని, ఇలా అనేక కారణాల చేత పూజలు, యాగాలు చేస్తుంటారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్(Niddhi Agerwal) కూడా తనకు సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావాలని పూజలు చేసింది. వేణు స్వామితో కలిసి తన నివాసంలో ప్రత్యేక పూజలు, యాగం చేసింది.
సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో నిధి అగర్వాల్(Niddhi Agerwal)కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇటీవలె ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి(Venu swamy) ఇప్పుడు నిధి అగర్వాల్ తో కలిసి యాగం చేయించారు.
గతంలో వేణు స్వామి(Venu swamy) హీరోయిన్ సమంత(samantha), నాగ చైతన్య విడాకులు తీసుకుంటారనే విషయాన్ని ముందుగానే చెప్పారు. నిజంగానే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోవడంతో వేణు స్వామి పంట పండింది. ప్రముఖుల జీవితాలపై ఆయన ఎన్నో విషయాలు చెబుతూ ఫేమస్ అయ్యారు. ఆయన మాటలపై చాలా మందికి నమ్మకం కుదిరింది. గతంలో హీరోయిన్ రష్మిక మందన్న కూడా వేణు స్వామితో పూజలు చేయించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం నిధి అగర్వాల్(Niddhi Agerwal)తో పూజలు చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(viral) అవుతోంది.