అఖండ తర్వాత మరో మాస్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. క్రాక్ మూవీతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టాక్. అయితే ఎన్బీకె 107(nbk 107 title) వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా టైటిల్‌ను దీపావళి కానుకగా అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే అక్టోబర్ 21న టైటిల్ రివీల్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
ఇక తాజాగా టైటిల్ లాంచింగ్ వేదికను ఖరారు చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ టైటిల్‌ను కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అక్కడ ఈ కార్యక్రమాన్ని మొట్ట మొదటిసారిగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ 21 రాత్రి 8 గంటల 15 నిమిషాలకి టైటిల్ అనౌన్స్ చేస్తున్నట్టు ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. దాంతో ఎన్బీకె వెన్యూ కూడా పవర్ ఫుల్‌గా ఉందని అంటున్నారు. దాంతో ఈ వేడుకకు అటెండ్ అయ్యేందుకు సన్నద్దమవుతున్నారు నందమూరి అభిమానులు.
ఇకపోతే ఈ సినిమాకు రెడ్డిగారు, అన్నగారు, జై బాలయ్య అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో ఏదో ఒకటి ఖరారు చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా టాక్. దీనిపై క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.