»Nayantara Nayantara Who Gave A Big Shock A Fight With Her Husband
Nayantara: బిగ్ షాక్ ఇచ్చిన నయనతార.. భర్తతో గొడవలా?
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది నయనతార. అది కూడా పెళ్లి తర్వాత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అయితే.. ఉన్నట్టుండి నయన్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు.
Nayantara: అరె.. ఉన్నట్టుండి నయనతార, విఘ్నేష్ శివన్‌లకు ఏమైంది? కొంపదీసి ఇద్దరి మధ్య తేడాలొచ్చేశాయా? అనే డౌట్స్ అన్ని ఒక్కసారిగా క్రియేట్ చేసింది నయన తార. ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీస్ అంతా.. విడిపోయే ముందు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకొని.. ముందే హింట్ ఇస్తున్నారు. సమంత మొదలుకొని నిహారిక వరకు ఇదే జరిగింది. దీంతో నయన తార కూడా భర్తను అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఐదారేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు నయన్, విఘ్నేష్. అలాగే.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు. ప్రస్తుతం నయన్, విఘ్నేష్ సంతోషంగా ఉన్నారు. సినిమాల పరంగాను బిజీ అయ్యారు. అయితే.. ప్రమోషన్స్‌కు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే నయన తార.. ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టింది. ఆమెకు 7.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నయన్ మాత్రం తన భర్తతో కలిపి కనీసం వంద మందిని కూడా ఫాలో అవడం లేదు. దీంతో.. నయన్ ఎవరిని ఫాలో అవుతుందనేది ఇట్టే తెలిసిపోతుంది.
అయితే.. ఉన్నట్టుండి సడెన్‌గా ఒక పోస్ట్ చేసి డిలీట్ చెయ్యడమే కాదు.. తన భర్తను అన్ ఫాలో చేసింది నయన తార. దీంతో.. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు మొదలయ్యాయా? అనే టాక్ ఊపందుకుంది. కానీ అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చింది అమ్మడు. ఈ వార్త వైరల్ అయ్యేలోపు ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను మళ్లీ ఫాలో అయింది. దీంతో.. ఇది తెలిసి జరిగిందా? లేదా అనుకోకుండా జరిగిందా? అనేది అర్థం కాకుండా పోయింది. కానీ నయన తార ఎందుకలా చేసింది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై అమ్మడు క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.