తొంభైతొమ్మిది సినిమాలు చేసిన ఒక సీనియర్ హీరోకి సరికొత్తగా కథని ఎంపిక చేయడమే కష్టమైన విషయమైతే, ప్రస్తుతం ఉన్న పోటీలో, ధియేటర్లకి ఆడియన్సే రావడానికి సుముఖత కనబరచని స్థితిలో ఆ కథని తెరకెక్కించి బాక్సాఫీసుని మెప్పించడం దాదాపుగా దుర్లభమైపోతోంది.
యువసమ్రాట్ నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు ఎఆర్ కార్తీక్ నిర్దేశకత్వంలో తెరకెక్కబోతున్న నాగార్జున నూరవ చిత్రనిర్మాణ కార్యక్రమాలు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి. మాపియా బ్యాక్ డ్రాప్లో రూపొందబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం నాగార్జున అభిమానులలో గానీ, దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్కినేని అభిమానులలోగానీ విపరీతమైన ఉద్వేగాన్ని నింపుతోంది. పైగా ఇటీవల రోజులలో నాగార్జునకి చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడం కూడా ఇందుకు ప్రధానమైన కారణం. ఆ మధ్యరోజుల్లో నాగార్జున చేసిన నా సామిరంగా చిత్రం కొంత వరకూ నాగార్జున అభిమానులలో కొంత ఊరటని నింపినప్పటికీ వాళ్ళు కాలర్ ఎగరేసుకునే రేంజ్లో మాత్రం అది లేకపోవడంతో అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ఈ నూరవ చిత్రం మీదనే ఉన్నాయి.
తొంభైతొమ్మిది సినిమాలు చేసిన ఒక సీనియర్ హీరోకి సరికొత్తగా కథని ఎంపిక చేయడమే కష్టమైన విషయమైతే, ప్రస్తుతం ఉన్న పోటీలో, ధియేటర్లకి ఆడియన్సే రావడానికి సుముఖత కనబరచని స్థితిలో ఆ కథని తెరకెక్కించి బాక్సాఫీసుని మెప్పించడం దాదాపుగా దుర్లభమైపోతోంది. ఇదిప్పుడు చిరంజీవి దగ్గర్నుచి అందరి సీనియర్ హీరోలు ఎదుర్కొంటున్న గడ్డుపరిస్థితే. ఈ అవరోధాన్ని అధిగమించి సినిమాని సూపర్ హిట్ చేయడమంటే బ్రహ్మప్రళయమే అవుతోంది.
అందుకే తండేల్ సక్సెస్ మీట్ నాగార్జున మాట్లాడుతూ ఇటీవలి రోజులలో సక్సెస్ మీట్ అనే మాటనే విని ఎన్నాళ్ళయిందోనని ఆనందంతో కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇది నిజం. అన్నపూర్ణ సంస్ధకి సంబంధించి సక్సెస్ వేడుకలను ఆ సంస్ధకి చెందిన హీరోలు పూర్తిగా మరచిపోయారు. చాలా కాలం తర్వాత తండేల్ చిత్రం ఈ పరిస్థితికి తెరదించి, అన్నపూర్ణ సంస్థకి నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాగార్జున చేయబోతున్న నూరవ చిత్రం అనేకరకమైన విశ్లేషణలకు తెరతీసింది. కాగా ఈ చిత్రానికి టైటిల్ ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. అయినా ఎవరి ఊహాగానాలు వాళ్ళవి అన్నట్టుగా కొత్తకొత్త టైటిల్స్ సోషల్ మీడియా రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అయితే అధికారికంగా తెలిసిన విషయమేంటంటే మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అందులో ముఖ్యంగా నాగ్ హండ్రెడ్ ఒకటైతే, మరొకటి చైన్ కింగ్ అనేది మరొకటి.యువసమ్రాట్ కూడా పరిశీలనలో ఉన్నట్టుగా గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాకి టైటిల్ ఎంపిక చేయడం కూడా కష్టమేనని అంటున్నారు. చూడాలి మరే టైటిల్ నూరవచిత్రాన్ని వరిస్తుందో….