JN: పెళ్ళిళ్ళు, ఇతర శుభాకార్యాలకు అద్దె బస్సులు కావాలనుకునే వారికి TGSRTC BOC పై బస్సులు ఇచ్చే అవకాశం కల్పిస్తున్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని డిపో పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రజా రవాణా సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు ముందుకు రావాలని, బుకింగ్ కొరకు 7382852933 సంప్రదించాలన్నారు.