KNR: సైదాపూర్ మండలం మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకులంలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులను గురువారం రాత్రి ఎలుకలు కొరికాయి. కాగా, ఈ గురుకులం ప్రస్తుతం హుజురాబాద్‌లోని ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. అయితే పాఠశాలలో ఎలుకల సంచారానికి ముఖ్యకారణం సిబ్బంది పరిశుభ్రతను పాటించకపోవటమే అని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.