SKLM: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండల విద్యుత్ శాఖ ఏఈ గా ఎం.సూర్యారావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో జిల్లా కేంద్రం విద్యుత్తు స్టోర్ రూమ్లో పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన ఏఈ వెంకటేశ్వరరావు ఆయన స్థానంలోకి బదిలీపై వెళ్లారు. లైన్మెన్ కాంతారావు, కాంట్రాక్టర్ పోగోటి లక్ష్మణరావు సిబ్బంది పాల్గొన్నారు.