MNCL: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేయాలని బీపీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు.