ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ కూడలిలో పురాతన గాంధీ విగ్రహాన్ని తొలగించి నూతన విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి కూడలిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్య వైశ్య సోదరులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.