»Mind Blowing Collections Hanuman First Day Collections
Hanuman: మైండ్ బ్లోయింగ్ వసూళ్లు.. హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్లు
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. మొదటి రోజు కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.
Mind Blowing Collections.. Hanuman First Day Collections
Hanuman: సంక్రాంతి పండుగా అంటేనే సినిమాల సందడి ఉంటుందని అందరికీ తెలుసు. పెద్ద హీరోల చిత్రాలు ఈ సీజన్లో ఎక్కువగా విడుదల అవుతాయి. అందుకే చిన్న సినిమాగా తెరకెక్కిన హనుమాన్(Hanuman) చిత్రానికి థియేటర్లు అనుకున్నంత లభించలేదు. దీంతో తక్కువ థియేటర్లో విడుదలైనా మంచి వసుళ్లనే రాబట్టింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రూ. 21 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రెడ్ వర్గాల అంచనా. దీంతో త్వరలోనే థియేటర్లు పెంచుతారనే టాక్ వినిపిస్తోంది.
సినిమా నిర్మాణానికి రూ. 25 కోట్లు అయిందని, పబ్లిసిటీ తదితర ఖర్చులతో మొత్తం రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇక 25 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలో దిగిన హనుమాన్ మొదటి రోజే రూ. 21 కోట్లు సాధించిందంటే, ఇక మొత్తం బిజినుస్ చాలా గట్టిగా అవబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు సైంధవ్ చిత్రం, రేపు నా సామిరంగ చిత్రాలు విడుదల అవుతున్నాయి. వాటి ఫలితాలు కూడా హనుమాన్‌పై ప్రభావం చూపిస్తాయా, లేదా అనేది చూడాలి. తక్కువ బడ్జెట్లో ఇంత మంచి వీఎఫ్ఎక్స్ ఇవ్వడం మాములు విషయం కాదని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma), టాలెంటెడ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో ఇది రెండవ సినిమా.