గుంటూరు కారం ఢీ కొట్టి మరీ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ. ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన అవుట్ పుట్కు ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ సినిమా ఓటిటి రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి.
సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదల అయిన హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ టాక్‌తో సొంతం చేసుకుంది. జనవరి 12న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో హనుమాన్ చిత్రం విడుదలైంది. రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. హనుమాన్ చిత్ర యూనిట్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసలైన సంక్రాంతి బొమ్మ హనుమాన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ ఓటిటి రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయిందనే న్యూస్ వైరల్ అవుతోంది. హనుమాన్ మూవీని ప్రముఖ ఓటిటి జీ5 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు 5 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. తేజ సజ్జా లాంటి యంగ్ హీరో సినిమాకు ఈ రేంజ్లో ఓటిటి హక్కులు అమ్ముడుపోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
ఈ సినిమాకు అయిన బడ్జెట్లో సగానికి పైగా ఓటిటి రైట్స్ ద్వారానే వచ్చాయంటున్నారు. దీంతో హనుమాన్ థియేట్రికల్, డిజిటల్ కలుపుకొని భారీ లాభాలు తెచ్చినట్టే. ఇక ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇప్పుడే చెప్పలేం. ఏదేమైనా.. హనుమాన్ ఓటిటి రైట్స్ అదుర్స్ అనే చెప్పాలి.