»Horoscope Today Todays Horoscope 2024 January 13th Expenses Will Increase
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 13th).. శుభవార్త వింటారు!
ఈ రోజు(2024 January 13th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఏ పనిచేసినా పూర్తి నమ్మకం పెట్టండి అనుకున్నది దక్కుతుంది. కుటుంబంలో సభ్యుల సహకారం లభిస్తుంది.
ఈ రోజు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే మంచి జరుగుతుంది.
వృషభం
మీ మీ రంగాల్లో పనిభారం ఉంటుంది. ఒత్తిడిని జయించి ముందుకు సాగుతే మంచిది. కుటుంబ సభ్యుల మాట వినండి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పారాయణ మంచిది.
మిథునం
బుద్ధి బలం, నమ్మకం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా ఉంటారు. కలహాల్లో తల దూర్చడం మంచిది కాదు. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి.
కర్కాటకం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రంగులలో వృద్ధి సాధిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో అందరిని ఆనందింప చేస్తుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవడం మంచిది.
సింహ
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తోటివారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఖర్చులు ఎక్కువైతాయి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి.
కన్య
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ, వ్యాపార అనుకూలత సిద్దిస్తుంది. తక్కువ ఖర్చు చేయాలి. పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సాయి నామాన్ని స్మరించండం ఉత్తమం.
తుల
పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం మాత్రమే ఉంటుంది. నచ్చినవారితో సంతోషాన్ని పంచుకుంటారు. మంచి వార్తలు వింటారు. దుర్గాస్తోత్రం మంచిది.
వృశ్చిక
మనోధైర్యంగా ఉండడం మంచిది. ఇంట్లో శుభకార్యం చేయాలని భావిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును ఆలోచించి అడుగేయాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.
ధనస్సు
తలపెట్టినా కార్యం త్వరగా పూర్తవుతుంది. కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించడం మంచింది. తెలివితేటలతో ఆలోచించడం మరిచిపోవద్దు. కొన్ని చర్చలు మీకు అనూలంగా ఉంటాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం చదవడం చేయాలి.
మకరం
శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కీలక వ్యవహారాలలో ఆలస్యం జరిగే అవకాశం ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా మెలగాలి. శనిధ్యానం చేయడం మంచిది.
కుంభం
నేడు ఒక శుభవార్త వింటారు. మీ పనికి అందరూ ప్రోత్సహిస్తారు. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.
మీనం
కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మంచిది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకపోవడం మంచిది. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు వైదొలుగుతాయి.