Bhola Shankar: మెగాస్టార్ ‘భోళా శంకర్’ భారీ బిజినెస్?
మెగాభిమానులు ఓ విషయంలో ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతునే ఉన్నారు. మిగతా హీరోలు స్ట్రెయిట్ మూవీస్ చేస్తుంటే.. చిరు, పవన్ మాత్రం రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అది కూడా తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమా తమిళ్ రీమేకే.. అయినా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
రీ ఎంట్రీ తర్వాత చేసిన ఐదు సినిమాల్లో రెండు రీమేక్, రెండు స్ట్రెయిట్ సినిమాలున్నాయి. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య స్ట్రెయిట్ సినిమాలు కాగా.. ఖైదీ నెం.150, గాడ్ ఫాదర్ రీమేక్ సినిమాలు. ఒక్క ఆచార్య తప్పితే ఈ సినిమాల రిజల్ట్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. మెగాస్టార్ కెరీర్లో ఆచార్య అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ పర్వాలేదనిపించింది. అయితే పోయిన సంక్రాంతికి వచ్చి వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఆచార్య, గాడ్‌ఫాదర్ ఫలితాలతో చిరు మార్కెట్ చాలా వరకు దెబ్బతిందని అనుకుంటున్న సమయంలో.. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ మార్కెట్‌ను మరింత పెరిగింది.
అందుకే లేటెస్ట్ ఫిల్మ్ రీమేక్ అయినా కూడా భారీగా బిజినెస్ జరుపుకుంటున్నట్టు సమాచారం. ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళాశంకర్’ని తెరకెక్కిస్తున్నాడు మెహర్ రమేష్. ఆగష్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్గా భోళా మేనియా సాంగ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా స్టార్ట్ అయినట్టు సమాచారం. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు 25 నుంచి 27 కోట్ల బిజినెస్ జరిగిందట.
సీడెడ్‌లో 15 కోట్లు, ఆంధ్రాలో ఏకంగా 40 కోట్ల రేంజ్లో భోళా శంకర్ బిజినెస్ జరిగిందట. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు దాదాపు 80 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. దీంతో భోళా శంకర్‌కు భారీ డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఏకే ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా కనిపించనుంది.