మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన రీమేక్ మూవీ ‘గాడ్ ఫాదర్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఓవర్సీస్‌లోను మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో మెగాస్టార్ చెప్పినట్టుగానే ‘ఆచార్య’ లోటును ‘గాడ్ ఫాదర్’ తీర్చేసిందని అంటున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక ఇదే ఊపుతో మరో మాసివ్ ట్రీట్ రెడీ చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం మెగా 154, భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్నారు చిరు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో.. తాజాగా మెగా 154 డబ్బింగ్ స్టార్ చేశారు. దర్శకుడు బాబీ, పలువురు టెక్నీషియన్ల సమక్షంలో పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ మొదలు పెట్టినట్టు.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా మాసివ్ అప్టేట్స్ రెడీ.. పూనకాలు లోడింగ్ అని చెప్పుకొచ్చారు. దాంతో మెగా 154 టీజర్ పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి మెగా 154 ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.