తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటివల నటించిన లియో చిత్రం ఓటీటీ విడుదల తేదీ దాదాపు ఖరారైంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ తో ఈ మూవీ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకోగా స్ట్రీమింగ్ తేదీని కూడా ఫైనల్ చేశారు.
దళపతి విజయ్ యాక్ట్ చేసిన తాజా చిత్రం లియో థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా అవతరించింది. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లతో రన్ అవుతుండగా, దాని OTT విడుదలపై ఇప్పటికే ఊహాగానాలు చర్చనీయాంశమయ్యాయి.
విడుదలైన నాలుగు వారాల తర్వాత సినిమాను ప్రసారం చేయడానికి మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఈ డీల్ కారణంగా థియేట్రికల్ OTT విడుదల మధ్య 8 వారాల వ్యవధి ఉన్న సినిమాలను ప్లే చేయాలనే నియమాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలోనే అనేక పెద్ద మల్టీప్లెక్స్ చైన్లు తమ థియేటర్లలో లియోని ప్లే చేయడాన్ని నిలిపివేశాయి.
ఇంతలోనే వారి ఒప్పందం ప్రకారం Netflix నవంబర్ 20న OTTలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండటం విశేషం. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లియోను రూపొందించారు. ఈ యూనివర్స్ లో ఇప్పటికే కత్తి, విక్రమ్ మూవీలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే సూర్య మొయిన్ లీడ్ తో రోలెక్స్ క్యారెక్టర్ ని హైలెట్ చేస్తూ మరో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక లియో చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. త్రిష కథానాయికగా నటించారు. సంజయ్ దత్, అర్జున్ సర్జాతో పాటు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.