కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అర్థరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీగా డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకుని దాడులు చేశారు.
Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అర్థరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీగా డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకుని దాడులు చేశారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేకుండా రూ.6 కోట్ల 65 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ డబ్బు ఎవరిదనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో కలకలం రేపుతోంది.
ఎన్నికల్లో పంచేందుకే తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతిమ హోటల్స్కు కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలన్నీ ఈ హోటల్ కేంద్రంగానే జరుగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. నగదు పట్టుబడిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరోవైపు సీజ్ చేసిన డబ్బులను కోర్టులో సమర్పిస్తామని ఏసీపీ నరేందర్తెలిపారు.