»Kanguva This Is Just The Beginning Kanguva Is A Solid Update
Kanguva: ఇది ఆరంభం మాత్రమే.. ‘కంగువ’ సాలిడ్ అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా వస్తున్న కంగువపై ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కంగువ. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న కంగువ.. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా సూర్య ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు సూర్య తెలిపారు. ఈ టీమ్ తనకు ఎన్నో జ్ఞాపకాలను అందించిందని, ఫ్యామిలీని మిస్ అవుతున్నట్లు ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లో సూర్య ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. ‘కంగువ సినిమా కోసం నా లాస్ట్ షాట్ పూర్తి అయ్యింది. చిత్రయూనిట్ మొత్తం చాలా పాజిటివ్‌గా ఉంది. ఇది ఒకదానికి ముగింపు, కానీ చాలా వాటికి ఆరంభం. ఎన్నో జ్ఞాపకాలను అందించిన దర్శకుడు శివ, టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. కంగువ చాలా పెద్దది, ప్రత్యేకమైనది. ఈ సినిమాతో పాటు మీ అందరినీ వెండితెరపై చూపించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను..’ అని సూర్య తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం కంగువ లేటెస్ట్ పోస్టర్, సూర్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో 3డీ & ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నారు. దిశా పటాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.