»Joe Biden And Donald Trump Are Competing In The Us Presidential Race
Biden vs Trump: అమెరికా అధ్యక్ష రేసులో బైడన్, ట్రంప్ పోటాపోటీ
అమెరికా అధ్యక్ష రేసులో నిలిచే అభ్యర్థులు ఖారారు అయ్యారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ మరోసారి పోటీ పడనున్నారు. త్వరలోనే వీరు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
Joe Biden and Donald Trump are competing in the US presidential race
Biden vs Trump: అమెరికా అధ్యక్ష రేసులో నిలబడే అభ్యర్థులపై సందిగ్దత వీడింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ ఇద్దరు పేర్లు ఖారారు అయ్యాయి. అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ దాదాపు కన్ఫామ్ అయిపోయింది. డెమోక్రాటిక్ పార్టీ తరఫున జో బైడెన్ తాజాగా జరిగిన జార్జియా ప్రైమరీలో గెలుపొందారు. దాంతో ఆ పార్టీ నుంచి నామినేట్ కావాడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా ఐలాండ్స్‌లోనూ ఆయన విజయం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ‘‘అమెరికా భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల ముందు ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసే వారికి మీ మద్దతు ఇస్తారా? మన స్వేచ్ఛను, భ్రదతను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని లాక్కునేవారికి అవకాశమిస్తారా?’’ అని జార్జియాలో తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ పేర్కొన్నారు.
ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష రేసులో ఉన్నారు. తాజాగా వాషింగ్టన్లో విజయం సాధించారు. దీంతో నామినేషన్‌కు కావాల్సిన ప్రతినిధుల మద్దతు లభించింది. అలాగే ఈరోజు మరికొన్ని ప్రైమరీల్లోనూ ఆయన విజయం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వానికి పోటీగా ఉన్న నిక్కీ హేలీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో బైడెన్, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు.