E.G: గోపాలపురం(M) హుకుంపేటలో గుట్టుచప్పుడు కాకుండా కోడికత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. SI మనోహర్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో 40 కోడికత్తులు, సానపెట్టే మిషన్, రెండు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు దేవరపల్లి CI నాయక్ తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో అక్రమంగా కత్తులు తయారు చేస్తున్నట్లు అందిన సమాచారంతో ఈ సోదాలు నిర్వహించారు.