CTR: నూతన సంవత్సరం పురస్కరించుకుని కాణిపాక వరసిద్ధుడి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తామని ఈవో పెంచల కిషోర్ అన్నారు. సుమారు 60 వేల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనాతో అవసరమైన ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్నప్రసాద కేంద్రంలో నిరంతరం అన్న ప్రసాదాన్ని అందిస్తామన్నారు. భక్తుల కోసం లక్ష లడ్డూలను సిద్ధం చేశామన్నారు.