వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన సంవత్సర నిన్న రాత్రి నిర్వహించిన వాహనాల తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్షలో 438 రీడింగ్ నమోదైంది. ఇది 2025 సంవత్సరంలో నమోదైన అత్యధిక డ్రంక్ అండ్ డ్రైవ్ రికార్డుగా వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాష్, మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ తెలిపారు.