కృష్ణా: తిరువూరు పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ముందస్తు చర్యగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బందోబస్తును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు వైవీ శాతకర్ణి, రాజు, స్టేషన్ సిబ్బంది, రోడ్డు సేఫ్టీ మొబైల్ సిబ్బంది పాల్గొన్నారు.