Jawaan: ‘జవాన్’ సినిమా నిషేధం.. షారుఖ్ ఫ్యాన్స్ నిరసన!
ప్రస్తుతం థియేటర్లో షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్లో దుమ్ములేపుతోంది. కానీ ఓ దేశంలో మాత్రం జవాన్‌ను నిషేధించారు. దాంతో షారుఖ్ ఫ్యాన్స్ నిరసన చేస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో పండగ చేసుకుంటున్నారు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్. పఠాన్ సినిమాతో వంద కోట్ల ఓపెనింగ్, వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టిన కింగ్ ఖాన్.. జవాన్ సినిమాతోను హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు డే వన్ 129 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఎక్కడ చూసిన జవాన్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ వీకెండ్ వరకు జవాన్ ఊహించని వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.
అలాగే పఠాన్ తర్వాత మరో వెయ్యి కోట్లు రాబట్టి.. షారుఖ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. అయితే ఇండియాలో ఇంత రచ్చ లేపుతున్న జవాన్ సినిమాకు.. బంగ్లాదేశ్‌లో మాత్రం బిగ్ షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమాను 10 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేశారు. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం రిలీజ్ కాలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రజలు పలు చోట్ల అక్కడున్న ప్రభుత్వం పట్ల నిరసనలు చేస్తున్నారు. దాంతో అక్కడ అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
అందుకే బంగ్లాదేశ్‌లో రాజకీయ, సామాజిక పరిస్థితులు బాగాలేవు. కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతావారణం నెలకొని ఉంది. దీంతో అక్కడ జవాన్ సినిమా విడుదలను బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నిషేధించింది. ఈ విషయంలో బంగ్లాదేశ్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను వెంటనే రిలీజ్ చేయాలని కోరుతూ రోడ్లపై నిరసన చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ‘జవాన్’ బంగ్లాదేశ్‌లో రిలీజ్ కావడం కష్టమేని తెలుస్తోంది.