»Janhvi Kapoor Devara Heroine For Pushpa 2 If True Will The Boxes Be Broken
Janhvi Kapoor: ‘పుష్ప 2’ కోసం దేవర హీరోయిన్? నిజమైతే బాక్సులు బద్దలే?
పుష్ప2 సినిమాను అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇక ఇప్పుడు దేవర హీరోయిన్ను రంగంలోకి దించుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. థియేటర్లో బాక్సులు బద్దలవడం పక్కా అనే చెప్పాలి.
Janhvi Kapoor: పుష్ప 2 కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాను పుష్ప పార్ట్ 1కు మించి ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా చెక్కుతున్నాడు. ఇప్పటికే ఈచిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్.. ఆ విషయాన్నీ చెప్పకనే చెప్పేశాయి. ఆగస్టు 15న పుష్ప2ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయడానికి రెండు యూనిట్స్ పెట్టి షూట్ చేస్తున్నారట.
బన్నీ ఫోకస్ మొత్తం ఈ సినిమా పైనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను ఆగస్టు 15న పుష్ప2 రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఐటెం బ్యూటీ ఎవరనేదే ఎటు తేలకుండా ఉంది. ఇప్పటికే దిశా పటానీతో అదిరిపోయే ఐటెం ప్లాన్ చేస్తున్నారని వినిపించింది. కానీ రోజుకో బ్యూటీ అన్నట్టు.. ఇప్పుడు తంగంను రంగంలోకి దింపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దేవర సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. అలాగే చరణ్‌తో ఆర్సీ 16లో కూడా ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు.
ఇక ఇప్పుడు ఐటెం సాంగ్ కూడా చేయడానికి జాన్వీ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ జాన్వీని సంప్రదించినట్టుగా సమాచారం. కానీ జాన్వీ అందుకు ఒప్పుకుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ.. దేవర సినిమా రిలీజ్‌కు ముందే జాన్వీ ఐటెం సాంగ్‌తో రిస్క్ చేస్తుందా? అనేది డౌటే. ఒకవేళ ఈ హాట్ బ్యూటీ పుష్పరాజ్‌తో చిందేస్తే మాత్రం.. పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.