»Jai Hanuman Jai Hanuman Work Start Who Is Hanuman
Jai Hanuman: ‘జై హనుమాన్’ వర్క్ స్టార్ట్.. హనుమంతుడు ఎవరు?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. ఇదే జోష్‌లో జై హనుమాన్ వర్క్ స్టార్ట్ చేశాడు.
Jai Hanuman: ఓ చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. పాన్ ఇండియా లెవల్లో సంచలనంగా నిలిచింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇంకా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇక హనుమాన్ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్‌గా జై హనుమాన్ అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. దీంతో ఈ సీక్వెల్ పై మరింత హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జై హనుమాన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలిపాడు ప్రశాంత్ వర్మ. హైదరాబాద్‌లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జై హనుమాన్ స్క్రిప్ట్‌ను హనుమాన్ విగ్రహం ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ‘హనుమాన్ పై అపారమైన ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రేక్షకుల అందరికి కృతజ్ఞుడిని. నా మాటను నిలబెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాను. చెప్పినట్టుగానే జై హనుమాన్ మూవీని 2025లో రిలీజ్ చేస్తాం. అయోధ్య రామమందిరం సందర్భంగా జై హనుమాన్ పనులను ప్రారంభించాం. మూవీని మొదలు పెట్టడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని అనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.
జై హనుమాన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. పార్ట్ 2 లో హనుమంతుడు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. భజరంగ్గా ఓ బిగ్ స్టార్ కనిపించనున్నారని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హనుమాన్‌గా నటిస్తారని ప్రచారం జరిగింది. అలాగే శ్రీరాముడిగా రామ్ చరణ్ పేరు వినిపించింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హనుమాన్‌లో నటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే జరిగితే.. జై హనుమాన్ హైప్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లనుంది.