»Devara The Villain Was Injured In The Shooting Of Devara
Devara: ‘దేవర’ షూటింగ్లో విలన్‌కు గాయాలు!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. తాజాగా ఈ సినిమా షూటింగ్‌తో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌కు గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ కన్ఫామ్ చేశారు.
Devara: జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో పాన్ ఇండియా సినిమాగా దేవర తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ రెడీ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే దేవర గ్లింప్స్ రిలీజ్ చేయగా ఇండియా వైడ్‌గా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొరటాల శివ ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అనేలా గ్లింప్స్ కట్ చేశారు. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోంది. అయితే.. ఈ షూటింగ్ సమయంలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అయినట్టుగా వార్తలొచ్చాయి. కానీ ఇది కేవలం పుకార్లే అనుకున్నారు. అయితే లేటెస్ట్గా దేవర టీమ్ సైఫ్ అలీ ఖాన్ గురించి ట్వీట్ చేసింది. ‘మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం, మీరు దేవర సెట్స్‌లో జాయిన్ అవ్వడానికి ఎదురు చూస్తున్నాం..’అంటూ ట్వీట్ చేశారు. దీంతో సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అని నిన్నటివరకు రూమర్‌గా వార్తలు నిజమయ్యాయి.
సైఫ్ కారణంగా లేటెస్ట్ దేవర షెడ్యూల్ కాస్త డిలే అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాతే సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.