»Ys Sharmila Said That They Will Be Called Jagananna Garu From Now On
YS Sharmila: ఇకపై జగనన్న గారు అనే పిలుస్తా
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనడం కొంతమంది వైసీపీ నేతలకు నచ్చడం లేదని ఇకపై జగనన్న గారు అనే పిలుస్తా అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు పలాస నియోజకవర్గంలో బస్సు ప్రయాణం చేశారు.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan)ను ఇకనుంచి జగనన్న గారు(Jagananna Garu) అనే పిలుస్తానంటూ ఏపీ సీసీ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. జగన్ రెడ్డి గారూ అని పిలిస్తే కొంతమంది వైసీపీ నేతలకు నచ్చడంలేదని, అందుకే జగనన్న గారూ అనే పిలుస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల నేటి నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. అందులో భాగంగా పలాసలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి బస్సెక్కారు. ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, స్థానికల సమస్యల అడిగి తెలుసుకున్నారు.
బస్సులోనే మీడియాతో మాట్లాడారు. తనపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తెలంగాణ నుంచి వచ్చన షర్మిల అంటూ ఆయన ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి అనడం వైవీ సుబ్బారెడ్డికి నచ్చడం లేదని, అందుకే ఈ రోజు నుంచి జగనన్న గారు అని సంభోదిస్తా అన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తేల్చాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఎక్కడుందో చూపించలని సవాల్ విసిరారు. టైమ్, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే తమతో సహా, మీడియా, మేధావులు రెడీగా ఉన్నారని వెల్లడించారు.