KRNL: ఎమ్మిగనూరు, నందవరం, పెద్దకడబూరు మండలాల్లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను ఎమ్మిగనూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5. 490 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. విచారణలో గంగప్ప తన పొలంలో సాగు చేసిన గంజాయిని ఇతరులకు విక్రయించి డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.