అక్కినేని అఖిల్‌కు ఏజెంట్ సినిమాతో గట్టి దెబ్బ పడింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. కానీ సురేందర్ రెడ్డి 'ఏజెంట్' మిషన్‌ను సక్సెస్ చేయలేకపోయాడు. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అదే రేంజ్లో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అఖిల్ విదేశాల్లో రిఫ్రెష్ అవుతున్నాడు. తిరిగొచ్చిన తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్‌ను ఇంకా అఫిషీయల్‌గా అనౌన్స్ చేయనే లేదు.. కానీ టైటిల్ మాత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ఏజెంట్ (Agent) తర్వాత అఖిల్(Akhil) క్రేజ్ ఏమైపోతుందో? అనేలా ప్రమోషన్స్‌లో హైప్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏజెంట్ హిట్ అయితే ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్‌తో ఉంటుందని అనుకున్నారు. అందుకు తగ్గట్టే గత కొద్ది రోజులుగా యూవీ క్రియేషన్స్‌తో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కానీ డైరెక్టర్ విషయంలోనే క్లారిటీ లేదు. అయితే ఫైనల్‌గా నెక్స్ట్ ప్రాజెక్ట్తోను అఖిల్ ప్రయోగం చేయడానికి ఫిక్స్ అయిపోయాడట.
గతంలో సాహో, రాధే శ్యామ్ సినిమాలకు పని చేసిన అనిల్(ANIL) అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా భారీ సోసియో ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది.ఇప్పటికే స్క్రిప్టు లాక్ చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ (Janvi kapoor) ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు టైటిల్ కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ అనుకుంటున్నారట.
కథకు తగ్గట్టుగా ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందని భావిస్తున్నారట. గతంలో మగధీర టైటల్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు రాజమౌళి, రామ్ చరణ్. ఇప్పుడు జస్ట్ ధీరగా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అఖిల్(Akhil) . టైటిల్ పవర్ ఫుల్‌గా ఉన్నప్పటికీ.. కంటెంట్ కూడా సాలిడ్‌గా ఉండాలని అంటున్నారు నెటిజన్స్. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ వస్తే గానీ.. టైటిల్ విషయంలో క్లారిటీ రాదు.