ఆదిపురుష్(Adipurush) పోస్ట్ పోన్ గురించి ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుందని టాక్. ప్రస్తుత పరిస్థితులు కూడా ఆదిపురుష్‌ను వాయిదా వేయించేలానే ఉన్నాయి. సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఆ సినిమాల కోసమే ఆదిపురుష్ ఆగిపోతున్నాడంటే.. ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు.
ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. ఎవరి క్రేజ్ వాళ్లది కాబట్టి.. ప్రభాస్‌కు ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆదిపురుష్ వాయిదా పడడానికి అసలు కారణం గ్రాఫిక్స్ అనే చెప్పొచ్చు. టీజర్లో గ్రాఫిక్స్ తేలిపోవడంతో.. దర్శకుడు ఓం రౌత్ మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందుకే సంక్రాంతి నుంచి ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసి.. 2023 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆదిపురుష్‌ను వచ్చే శ్రీరామనవమి సందర్భంగా.. మార్చి చివర్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. ఇది నిజమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదని చెప్పొచ్చు. ఈ క్రమంలో మేకర్స్ పై మండిపడుతున్నారు అభిమానులు. సాహో, రాధే శ్యామ్ ఫ్లాప్స్ తర్వాత రాబోతున్న సినిమాలు.. ఎప్పటికప్పుడు వాయిదాలతో నిరాశ పరుస్తున్నాయని వాపోతున్నారు. అయితే నిజంగనే ఆదిపురుష్ పోస్ట్ అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం.