»Is Ram Charans Birthday Treat Out Of The Ordinary
Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ మామూలుగా లేదుగా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నుంచి ఈసారి బర్త్ డే ట్రీట్ మామూలుగా ఉండేలా లేదు. ఒకేసారి మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడ చరణ్. దీంతో ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ఓ రేంజ్లో ఉంది.
Is Ram Charan's birthday treat out of the ordinary?
Ram Charan: ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ గేమ్ చేంజర్ పై భారీ అంచనాలున్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. రీసెంట్గా వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్‌తో గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. అందుకే ఆర్సీ 16ని గ్రాండ్‌గా లాంచ్ చేశాడు చరణ్. త్వరలోనే ఆర్సీ 16 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే.. దానికంటే ముందే గేమ్ చేంజర్, ఆర్సీ 16 నుంచి సాలిడ్ అప్డేట్స్ రానున్నాయి. మార్చి 27 న రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు మెగాభిమానులు.
ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలైపోయింది. శిల్ప కళా వేదికలో పుట్టిన రోజు వేడుకలు జరగున్నాయి. ఇక చరణ్ సైడ్ నుంచి సినిమాల అప్టేడ్స్ రెడీ అవుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ నుంచి జరగండి.. జరగండి.. సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు తమన్. ఈ సాంగ్‌తోనే చరణ్ అసలు సిసలైన బర్త్ డే సెలెబ్రేషన్స్ మొదలు కానున్నాయి. అలాగే ఇటీవల గ్రాండ్‌గా లాంచ్ చేసిన RC16 మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్స్ వినిపిస్తోంది. ఇక మరో పవర్ ఫుల్ అప్డేట్.. సుకుమార్, రామ్ చరణ్ కాంబో నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో చరణ్‌కు సంబంధించిన ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి.