ట్రిపుల్ ఆర్ వరకు యంగ్ టైగర్ ట్యాగ్‌తో ఉన్న ఎన్టీఆర్.. దేవర సినిమా నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారనున్నాడు. ప్రజెంట్ దేవర సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి?
NTR: కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర సినిమా.. ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉంది. గోవాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. లేటెస్ట్గా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన వీడియోతో పాటు.. మేకర్స్ రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్‌లో మస్త్ ఉన్నాడు యంగ్ టైగర్. దీంతో దేవర మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు టైగర్ ఫ్యాన్స్. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్ కానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. కొరటాల శివ విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వార్ 2 సెట్స్‌లోకి జాయిన్ అవనున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ఓటిటిలోకి అంటే.. ఏదో వెబ్ సిరీస్ చేస్తున్నాడనుకుంటే పొరబడ్డట్టే.
తాజాగా ఓ ఓటిటి సంస్థ తారక్‌కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సదరు ఓటిటి సంస్థ ఓ టాక్ షో ప్లాన్ చేస్తోందట. దీంతో షో నిర్వాహకులు హోస్ట్‌గా ఎన్టీఆర్ వ్యవహరించాలని కోరినట్లు సమాచారం. అయితే ఈ టాక్ షోకు పారితోషికం ఇవ్వడమా? లేదా ఓటిటిలో భాగస్వామ్యం ఇవ్వడమా? అనే దానిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. అఫిషీయల్ స్టేట్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ వంటి షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందుకోసం భారీ పారితోషికం అందుకున్నాడు. యాడ్స్ కోసం కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు తారక్. ఒకవేళ ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి హోస్ట్‌గా అవతారమెత్తితే.. గట్టిగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.