»Super News For Prabhas Fans Baahubali Combo For Spirit
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. స్పిరిట్ కోసం బాహుబలి కాంబో?
మరోసారి బాహుబలి కాంబినేషన్ రిపీట్ అవుతుందా? అంటే, ఔననే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్‌లో బాహుబలి కాంబో కోసం ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు?
Super news for Prabhas fans.. Baahubali combo for Spirit?
Prabhas: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ 2 తర్వాత కల్కిగా రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత మారుతితో కలిసి రాజ సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ పైన ప్రశాంత్ నీల్ మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ సలార్ 2.. శౌర్యాంగ పర్వం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి స్పిరిట్ మూవీ థియేటర్లోకి రానుంది. కల్కి, రాజా సాబ్ ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. సలార్ 2, స్పిరిట్ మాత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. ఫ్యాన్స్‌కి మాటిచ్చినట్టుగా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. కల్కి షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవగా.. రాజ సాబ్ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది.
దీంతో.. ఏప్రిల్‌లో సలార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ ఏడాది చివర్లో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అయితే.. స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు? అనేదే అంతుబట్టకుండా ఉంది. ఈ సినిమాలో అనిమల్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఫైనల్ అయిందనే టాక్ ఉన్నప్పటికీ.. నిజమెంత అనేది తెలియదు. కానీ ఇప్పుడు బాహుబలి కాంబోని రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడట సందీప్ రెడ్డి. ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్కను తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి స్వీటీ దగ్గరకు వెళ్లి కథను కూడా వినిపించాడట. అనుష్క కూడా ఓకె చెప్పిందట. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క.. ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెడుతోంది. ఈ క్రమంలో స్పిరిట్‌లో స్వీటి పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి.