»Is Niharikas Ex Husband Ready For Second Marriage Girl Is A Powerful Background
Chaitanya : నిహారిక మాజీ భర్త రెండో పెళ్లికి రెడీ? అమ్మాయిది పవర్ ఫుల్ బ్యాక్గ్రౌండ్?
నాగ చైతన్య, సమంత.. ధనుష్, ఐశ్వర్య తర్వాత నిహారిక, చైతన్య విడాకుల మ్యాటర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం నిహారికగా ఫ్రీ బర్డ్లా ఫుల్గా చిల్ అవుతోంది.
మెగా ఫ్యామిలీలో మాత్రం విడాకుల వ్యవహారం ఎప్పుడు హాట్ టాపికే. చిరంజీవి (Chiranjeevi) కూతురు శ్రీజ డివోర్స్ మ్యాటర్ కొత్తగా.. ఎప్పటికప్పుడు వింటునే ఉన్నాం. రీసెంట్గా మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకుంది. 2020లో చైతన్య, నిహారిక(Niharika)ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందని అనిపించుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ.. నిహారిక కొణిదెల, చైతన్య (Chaitanya) జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు రావడంతో.. ఎవరి దారి వారు చూసుకున్నారు.
ప్రస్తుతం నిహారిక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. అలాగే విడాకుల (Divorce) తరువాత కొంత గ్యాప్ తీసుకొని తన కెరీర్ వైపు అడుగులు వేస్తోంది. మరి ఆమె మాజీ భర్త చైతన్య ఏం చేస్తున్నాడంటే? రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడనే టాక్ నడుస్తోంది. విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిన చైతన్య.. కొన్ని ఆశ్రమాలు తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడనే టాక్ ఉంది.
ఈ క్రమంలో చైతన్య జొన్నలగడ్డ రెండో పెళ్ళికి సిద్ధమయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చైతన్య తల్లిదండ్రులు.. వారి కుటుంబంలోనే అతనికి వరుస అయ్యే అమ్మాయిని ఫిక్స్ చేశారట. తన ఫ్యామిలీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో పెళ్లి (Second marriage) జరుగబోతుందట. ఇందుకు చైతన్య కూడా ఓకె చెప్పాడట. త్వరలోనే ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.