నిజామాబాద్ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PMMODI) 8 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించారు.పెద్దపల్లి(Peddapally)లో అత్యాధునిక సూపర్ పవర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్ -సిద్దపేట రైల్వే లైన్ను ప్రారంభించారు.సిద్దిపేట (Siddipet) ప్రాంత ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన రైలు సర్వీసు ఎట్టకేలకు ప్రారంభమైంది.
మంగళవారం ప్రధాని ఈ రైలుకు వర్చువల్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ (Telangana) పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇందూరు లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే ఆయన సిద్దిపేట రైలును ప్రారంభించారు. ఇక దీనితో పాటు రాష్ట్రంలో సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు, ప్రారంభించారు. దేశమంతా వంద శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తి చేస్తామని ప్రధాని తెలిపారు.
నిజామాబాద్ (Nizamabad) బహిరంగ సభలో ‘నా కుటుంబసభ్యులారా’ అంటూ మోదీ తెలుగులో ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తుంది. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ కింద 20 క్రిటికల్ కేర్ బ్లాక్ లకు శంకుస్థాపన చేశాం. దేశంలో ఎయిమ్స్ (AIIMS) సంఖ్యను పెంచుతాం’ అని మోదీ పేర్కొన్నారు.ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు రూ.4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం బీబీనగర్(Bibinagar)లో ఎయిమ్స్ నిర్మిస్తున్నట్లు మోదీ చెప్పారు.