Chiranjeevi : బిగ్ సర్ప్రైజ్.. త్రివిక్రమ్‌తో మెగాస్టార్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయనున్నారా? అంటే, ఔననే టాక్ వినిపిస్తోంది. మరి చిరు, త్రివిక్రమ్ కమిట్ అయిన మిగతా సినిమాల సంగతేంటి?
భోళా శంకర్ (Bhola Shankar) తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే మెగా 157 ప్రాజెక్ట్ ప్రకటించారు. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట(Mallidi Vasishta)తో భారీ సోషియో ఫాంటసీ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్ కోసం వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కానీ ఈలోపు మెగా 156ని మంచి ఫ్యామిలీ డ్రామాగా చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిరు. ఇప్పటికే ‘బంగార్రాజు(Bangarraju)’ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మెగా 156 కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాను చిరు పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మించనుంది.
కానీ ఇప్పుడు ఉన్నట్టుండి త్రివిక్రమ్ (Trivikram)పేరు తెరపైకి వచ్చేసింది. గతంలో ఓ ఈవెంట్లో త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేశారు మెగాస్టార్. కానీ ఆ తర్వాత దాని ఊసే లేకుండా పోయింది. దీంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా లేనట్టేనని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు చిరంజీవి(Chiranjeevi), త్రివిక్రమ్ కాంబినేషన్‌కు రంగం సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కానీ ఈలోపే చిరంజీవితో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే నిజమైతే.. ఇది మెగా 158 అవుతుందా? లేదంటే 156నే త్రివిక్రమ్‌తో చేస్తాడా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మాత్రం.. అదిరిపోతుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మరి ఇప్పుడైనా చిరు, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తారేమో చూడాలి.