»Tiger Nageswara Rao Trailer Telugu Ravi Teja Vamsee Abhishek Agarwal
Tiger Nageswara Rao ట్రైలర్ చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి..
హీరో రవితేజ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్ర ట్రైలర్ వచ్చేసింది. గజదొంగ నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా తాజగా విడుదలైన ట్రైలర్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
Tiger Nageswara Rao: అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) నిర్మాతగా, వంశీ(Vamsee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao). మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) టైటిల్ రోలో నటిస్తుండగా ఆయనకు జోడిగా నపూర్ సనన్(Napur Sanan) నటిస్తోంది. స్టూవర్ట్ పురం నాగేశ్వరరావు అనే గజదొంగ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపైనా రవితేజ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులకు మంచి అంచనాలే ఉన్నాయి. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టగా ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధం అయ్యారు. తాాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో రవితేజ ఫ్యాన్స్‌లో అప్పుడే దసరా పండుగ వాతావరణం మొదలైంది. ఇక మాసీవ్ యాక్షన్‌తో ట్రైలర్ ఉంది.
స్టూవర్ట్ పురం పేరు చెబితే చాలు చుట్టు పక్కల ప్రాంతా ప్రజలకు నిద్రపట్టదు. అలాంటి స్టూవర్ట్ పురాన్ని దేవుడు అనే వ్యక్తి వేలం పాట పాడుతుండడంతో ట్రైలర్ మొదలు అవుతుంది. ఆ తరువాత ట్రైన్లో జరుగబోయే దొంగతనం గురించి నాగేరశ్వరరావు ముందే పోలీసులకు తెలియజేస్తుంటాడు. అంటే తాను చేయబోయే లూటీకి ముందు పోలీసులకు చెప్పడం ఆయన అలవాటు. అదే నాగేశ్వరరావు మార్క్ ఉన్నట్లుంది. ట్రైలర్ మొత్తం రా అండ్ రస్టిక్‌గా ఉంది. అలాగే హీరోయిన్ ఎంట్రీ తనతో చెప్పే డైలాగ్ కూడా చాలా బాగుంది. కొలతలు బాగున్నాయి అని మగజాతి అంతా కొలతలే చూస్తారు కాని ఆరాధన, అభిమానం అంటూ నోటికొచ్చిన భూతులు మాట్లాడుతుంటారు అనే డైలాగ్ ఆ క్యారెక్టర్ స్ట్రైట్నెస్ను తెలియజేస్తుంది. అలాగే నాగేశ్వరరావు పట్టుకోవడానిక యాంటియగనెస్ట్ రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేస్తాడు. తరువాత పోలీసు ఆఫీసర్‌గా మురళి శర్మ చెప్పే డైలాగ్ ప్రేక్షకుడికి కచ్చితంగా హైప్‌ని ఇచ్చింది. స్టూవర్ట్‌పురం నాగేశ్వరరావు కథ ఇక్కడే ముగిసింది. ఇక్కడ నుంచే టైగర్ నాగేశ్వరరావు కథ మొదలైంది అనే డైలాగ్‌తో సినిమా ఎంత మాస్సీవ్గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ట్రైలర్ ఎండింగ్లో హీరో పంజాబి పాగ కట్టుకొని ఉన్నాడు. బ్యాక్ షాట్లో ఇందిరాగాంధీని చూపించారు. అంటే నాగేశ్వరరావుకు అప్పటి పీఎంకు ఏంటి సంబంధం. లాంటి ప్రశ్నలు కచ్చితంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.